దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సమాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత నాలుగు నెలల నుంచి వరుసగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల స్థిరంగా ఉంటున్నాయి. అయితే ఎట్టకేలకు డీజిల్ ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా డీజిల్ ధర తగ్గింది.. ఇవాళ లీటర్ డీజిల్పై 25 పైసల మేర కోత పెట్టాయి ఆయిల్ సంస్థలు.. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27కి దిగివచ్చింది. పెట్రోల్ ధర రూ.101.84గా కొనసాగుతోంది.. ఇక, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.47గా ఉంటే.. డీజిల్ ధర రూ. 93.84కి తగ్గింది. ఇక, కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.08గా ఉంటే.. లీటర్ డీజిల్ ధర రూ.92.52గా ఉంది. మరోవైపు.. హైదరాబాద్లో లీటర్ డీజిల్పై 20 పైసలు తగ్గడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.33కి తగ్గగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.105.83గా కొనసాగుతోంది. చమురు ధరలు పెరగడంతో ట్రాన్స్ ఫోర్ట్ చార్జీలు పెరుగుతాయి. ఫలితంగా అన్ని వస్తువలపై రేట్లు పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగడానికి కారణం ఇదే