రెండు దేశాల యుద్ధం… ధరల పెరుగుతున్నాయ్… అందరూ సిద్ధంగా ఉండండి.. అన్నట్లు ఉంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఈ యుద్ధం అంతర్జాతీయంగా నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలకు అనుగుణంగా.. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది చమురు విక్రయ కంపెనీ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ). ఇది భారత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ. తాజా ధరల పెంపుతో అక్కడ ఇంధన ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. శ్రీలంకలో లీటర్ డీజిల్‌పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్‌పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎల్‌ఐఓసీ తెలిపింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.254కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైనందున ఎల్‌ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital