ఔటర్ రింగ్ రోడ్ మొత్తం జిగేల్ మనిపించే ఎల్ఈడీ లైట్ల వెలుతురులో మెరిసిపోతోంది. గతంలో ప్రయోగాత్మకంగా 26 కి.మీ మేర రోడ్డుకు ఇరువైపుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఓఆర్ఆర్ వ్యాప్తంగా లైటింగ్ పనులను కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల రాత్రివేళల్లో యాక్సిడెంట్లు జరగకుండా వాహనాలు జాగ్రత్తగా వెళ్లే చాన్స్ ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పగలు కూడా లైట్లను ఆపేయకుండా అట్లానే ఉంచుతున్నారు. దీంతో హెచ్‌ఎండీఏకూ విపరీతమైన కరెంట్ బిల్లులు వస్తున్నట్టు తెలుస్తోంది.
సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు లైటింగ్ ఉంటే పర్వాలేదు కానీ, డే టైమ్‌లో కూడా లైట్లు వెలగడం వల్ల ఎవరికి ఉపయోగం అని చాలామంది వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై పెదవి విరుస్తున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే కరెంటు బిల్లులను వారి ఇంట్లో నుంచి చెల్లించడం లేదు కదా.. అందుకే అట్లా వదిలేస్తున్నారేమో అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలి. నైట్ టైమ్‌లో మాత్రమే ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని చాలామంది కోరుతున్నారు.
డే లైట్‌కి అడ్జస్ట్ అయ్యేలా చేయాలి..
ఇక.. గతంలో కరెంట్ చార్జీల భారం లేకుండా సోలార్‌పై హెచ్ఎండీఏ అధ్యయనం చేసినా.. నిర్మాణ వ్యయం పెరుగుతుందని కేవలం ఎల్ఈడీ లైట్లతో ఈ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ ఒకే చెప్పింది. సోలార్ అప్ గ్రేడేషన్‌కు వీలుండేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రోడ్లపై వెహికల్స్ రద్దీకి అనుగుణంగా లైటింగ్ ఆటోమేటిగ్గా అడ్జెస్ట్ అయ్యేలా సిస్టమ్‌ని రూపొందిస్తామన్న అధికారులు దానిపై ఫోకస్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. డే టైమ్ లైట్‌కి తగ్గట్టు పవర్ సప్లయ్ నిలిచిపోయేలా చేస్తే లక్షలాది రూపాయల కరెంటు బిల్లులు హెచ్ఎండీఏకి ఆదా అవుతాయని చెబుతున్నారు.