Tuesday, November 19, 2024

రాజకీయాల్లోకి కోలీవుడ్ స్టార్.. ప్రశాంత్ కిశోర్‌తో విజయ్ భేటీ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, విజయ్ ఇటీవల హైదరాబాద్‌లో కలిశారని ప్రచారం జరుగుతోంది. రహస్యంగా భేటీ అయిన వీరిద్దరూ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ నాయకత్వంలో మెగా కూటమిని ఏర్పాటు చేస్తే అధికారంలోకి రావడం తథ్యమని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరిపారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement