Monday, November 25, 2024

IPL | ధోనీ బౌండరీలకు.. చెన్నై స్టేడియంలో పూనకాలు!

ఐపీఎల్​ 41వ మ్యాచ్​లో ఇవ్వాల (ఆదివారం) పంజాబ్​కింగ్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య పోరు జరుగుతోంది. టాస్​ గెలిచిన చెన్నై జట్టు తొలుత  బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కాన్వే 92, రుతురాజ్​ (37) మంచి భాగస్వామ్యం ఇచ్చారు. ఆ తర్వాత శివం దూబే (28), మోయిన్​ అలీ (10), రవీంద్ర జడేజా (12) పరుగులతో కాస్త పర్వాలేదు అనిపించినా.. కాన్వే మాత్రం ఒంటరిపోరాటం చేసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు.

ఇక చివరి ఓవర్​లో జడేజా అవుట్​ కావడంతో క్రీజులోకి కెప్టెన్​ ధోనీ వచ్చాడు. అయితే.. జడేజా అవుట్​ కాగానే స్టేడియంలో ఒక రకమైన సంబురం కనిపించింది. ధోనీ ఆటను చూడాలన్న కుతూహలంతో అభిమానులు పసుపురంగు జెండాలను ఎగరేస్తూ సందడి చేశారు. ఇక ధోనీ లాస్ట్​ రెండు బాల్స్​ని సిక్స్​లుగా మలచడంతో చెన్నైలోని చిదంబరం స్టేడియం సమ్మక్క సారలమ్మ జాతరను తలపించింది. కేరింతలు, అరుపులు, కేకలతో ధోనీ ఆటను ఆస్వాదించారు అభిమానులు..

కాగా.. చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. తదుపరి బరిలోకి దిగనున్న పంజాబ్​ జట్టు 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement