ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ధర్మపురి శ్రీనివాస్ ది లక్కీహ్యాండ్ అని అన్నారు. ఆయన పార్టీలోకి రావడం సంతోషమని తెలిపారు. డిఎస్ పీసీసీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. డీఎస్ వయసును చూడొద్దు, అనుభవాన్ని చూడాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. ఇలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని పేర్కొన్నారు. కాగా ఈ నెల 24న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. డీఎస్ కాంగ్రెస్ లోకి రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..