Friday, November 22, 2024

Lockdown: తెలంగాణలో లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన డీహెచ్

తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో లాక్ డౌన్ విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగితే లాక్ డౌన్, కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామన్నారు. జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది అర్హులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు ముందుకు రావాలని డీహెచ్ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement