విమాన సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొన్ని గైడ్లైన్స్, రూల్స్ని తాజాగా జారీచేసింది. డ్యూటీ చేస్తున్నవారు15 రోజుల్లో తమ మెడికల్ ఫిట్‌నెస్ తగ్గడానికి దారితీసే పరిస్థితులతో పాటు వైద్య పరిస్థితులపై ఈ తాజా నిర్ధేశాలున్నాయి. ఏదైనా మందులను నిరంతరం ఉపయోగించడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు సిబ్బంది విమానయాన సంస్థలకు తప్పకుండా తెలియజేయాలి. విమానయాన సంస్థలు డిజిసిఎ మెడికల్ డైరెక్టరేట్‌కి ఈ విషయాన్ని తెలియజేయాలి. తద్వారా వారు ఫ్లై చేయడానికి లైసెన్స్ కోసం మెడికల్ అసెస్‌మెంట్ జారీ చేయడానికి, లేదా పునరుద్ధరణకు ముందు ఈ తాజా వైద్య పరీక్షను తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలాంటి వైద్య పరిస్థితులలో అంటే..
ప్రెగ్నెన్సీ (Pregnancy )
గాయం లేదా శస్త్రచికిత్సా విధానం (Any Injury or Surgical Procedure)
స్పృహ కోల్పోవడం (Any Loss of Consciousness)
కిడ్నీ లేదా గాల్ బ్లాడర్ స్టోన్ చికిత్స (Kidney or Gall Bladder Stone Treatment)
కరోనరీ యాంజియోగ్రఫీ (Coronary Angiography)
కరోనరీ యాంజియోప్లాస్టీ (Coronary Angioplasty)
అసాధారణ గుండె లయలు ( Abnormal heart rhythms)
అసాధారణ ఫలితాలతో ఏదైనా వైద్య పరిశోధన (Any medical investigation with abnormal results)
సాధారణ మందుల వాడకం (Any regular use of medication)
ఆల్కహాల్ లేదా సైకోయాక్టివ్ పదార్ధాల కోసం పాజిటివ్ పరీక్షలో విమానయాన సంస్థలు తమ విమాన సిబ్బందికి అందించే పీరియాడిక్ హెల్త్ ఎడ్యుకేషన్‌లో ప్రివెంటివ్, ఎడ్యుకేటివ్ విభాగంలో అధికారికంగా ఈ అంశాన్ని పరిచయం చేయాలని DGCA విమానయాన సంస్థలను కోరింది.
సిబ్బంది ఎవరైనా అనారోగ్యం, గాయంతో బాధపడి, నిరంతరంగా విధులు నిర్వర్తించలేనట్లయితే.. సిబ్బంది తాజా వైద్య పరీక్షల తర్వాత ‘ఫిట్’గా ఉన్నట్టు తెలియకుండా వారి లైసెన్స్ అధికారాలను ఉపయోగించకూడదని DGCA పేర్కొంది. 15 రోజుల కంటే ఎక్కువ ఏదైనా వైద్యపరమైన అనారోగ్యం లేదా గాయంతో బాధపడుతున్నప్పుడు .. ఏదైనా మందులను తీసుకుంటూ ఫ్లైయింగ్ డ్యూటీలకు దూరంగా ఉండాలని విమాన సిబ్బందికి DGCA సూచించింది.