శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు కనులపండువలా సాగుతున్నాయి. వేద మంత్రాల పఠనం, భక్తుల జయ జయ ద్వనులు, శివన్నామస్మరణతో శ్రీగిరులు మారు మ్రోగుతున్నాయి. మహా శివరాత్రి పురస్కరించుకొని మంగళవారం శ్రీశైలం కు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తమ ఇష్టదైవం లైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలనుదర్శించుకుంటున్నారు. ఓవైపు వాహనాలలో భక్తులు భారీగా తరలి వస్తుండగా, మరోవైపు కాలినడకన భారీగా శివ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీశైలంలో భక్తిమార్గం ఉపొంగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది.
తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని శివ భక్తులు వడివడిగా ఇల కైలాసం చేరుకుండగా, వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రధాన ఆలయ పరిసరాలు, దారులన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు చేసి క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. శివన్నామస్మరణ చేస్తూ బ్రమరాంబికా, మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు, ప్రత్యేక కంకణాలతో కాలినడకతో వచ్చే వారితో, దీక్షాపరులతో దర్శన కూలైన్లలో జనం బారులు తీరారు.
మహా శివరాత్రి నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలంలో దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి ఉంటారని ఆలయ అధికారులు అంచనా. వసతిగృహాల తో పాటు శ్రీశైలం లోని ప్రతి మండపం, చెట్టు, పుట్టలతో పాటు ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన టెంట్ల కింద భక్తుల రద్దీ కనిపిస్తుంది. తమకు అనుకూల వేళలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకునే పనిలో భక్తులు కనిపిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా గా శ్రీ శైలం లో ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రబోతవంతో ప్రారంభం అవుతుంది. రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, 10 గంటల నుంచి శ్రీ స్వామివారి లింగోద్భవ కాల మహాన్యస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగా అలంకరణ, రాత్రి 12 గంటలకు శ్రీ స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం శ్రీశైలంలో కన్నులపండువగా సాగనుంది.