షిరిడీ సాయి సన్నిధికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, దూరం నుంచి వచ్చేవారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి బాబా దర్శనం సులభతరం చేయాలని కోరారు శివసేన లీడర్ కమలాకర్ కోటే. సోమవారం ఆయన షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీ భాగ్యశ్రీ బనాయత్ ముందుకు పలు సమస్యలను తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి ట్రస్ట్ చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో ప్రధానంగా ప్రతి గురువారం షిరిడీ సాయిబాబా పల్లకీని సాయిసమాధి దేవాలయం నుండి ద్వారకామాయి, చావాడికి వెళ్లాలని తాము కోరుతున్నట్టు తెలిపారు.
ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సాయి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అయితే ప్రస్తుతం మంకారీలు, గ్రామస్తులు, వీఐపీలు, మాజీ ధర్మకర్తలు పల్లకీ చుట్టూ నిలబడి పల్లకీని అడ్డుకుంటున్నారని తెలిపారు కమలాకర్ గణపత్రాపు కోటే.. అలాగే, సమాధి గుడి నుండి బయలుదేరేటప్పుడు బాబా ఫొటో, పాదుక రెండింటి మధ్య చాలామంది నిలబడి ఉంటున్నారని, పల్లకీ ద్వారకామాయికి వచ్చిన తర్వాత, వారు పల్లకి చుట్టూ నిలబడి కెమెరాల్లో ఫొటోలు తీసకుంటున్నారన్నారు.
ఇక.. చావడిలో కూడా కెమెరా ముందు నిలబడి బాబాను దర్శించుకోకుండా భక్తులను అడ్డుకుంటున్నారన్నారు. పల్లకీ, రథం వెనుక అందరూ నడవాలన్నది నియమం.. అటువంటి సందర్భాల్లో, బాబా పల్లకీలు, రథాలు అని పిలవబడే వాటిని నిరోధించడం.. క్రమశిక్షణ చేయడం అవసరమని తెలిపారు. అలాగే ద్వారకామాయిని భక్తులకు దర్శనం కోసం తెరవాలని, సమాధి ఆలయంలోని అద్దాలను తొలగించాలని భావిస్తున్న తరుణంలో ఆలయ శాఖ, పరిరక్షణ శాఖ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దీంతో భక్తులు “ఏజ్ చలో ఆగే చలో..” అని అరుస్తున్నారని, భక్తులు అక్షరాలా ఆలయం నుండి బయటకు నెట్టివేయబడుతున్నారని ట్రస్ట్ అధికారుల దృష్టికి తీసుకోచ్చారు. అలాగే గురుస్థాన్ ఆలయాన్ని కూడా నెట్‌తో కప్పేశారని, ఈ ఆలయాలన్నీ మూసివేయడం వల్ల సాయి భక్తులు ఆధ్యాత్మిక దర్శనం పొందలేకపోతున్నారని ఆరోపించారు. దీంతో చాలామంది బాబాని దర్శించుకోకుండా ఇబ్బందిపడుతున్న విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించూలా చూసి.. లక్షలాది మంది బాబా భక్తులకు సులభమైన దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.