ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్ష చేపట్టారు. కరోనా బాధితుల విషయంలో జగన్ ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని.. బాధితులకు చికిత్స అందించడంలో, ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో దీక్షకు దిగిన దేవినేని ఉమ మాట్లాడుతూ.. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలను కాసేపు పక్కనపెట్టి కరోనా బాధితులపై దృష్టి సారించాలని హితవు పలికారు. కరోనా పరీక్షలను కూడా ప్రభుత్వం సరిగా చేయలేకపోతోందని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement