Wednesday, November 20, 2024

ఏటా 5కోట్ల మంది ప్రయాణించేలా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు..

ప్రతి 3.6 నిమిషాలకు ఒక విమానం
రోజూ దాదాపు 400 విమానాలు రాకపోకలు
8500 కోట్లతో ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణ ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో తెలంగాణలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ముందువరుసలో నిలుస్తోంది. ఈ విమానాశ్రయం నుంచి రోజూ 50వేల మంది, ఏటా 2 కోట్ల మంది విదేశాలకు ప్రయాణిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో విమానాశ్రయ అభివృద్ధికి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అథారిటీ చర్యలు చేపట్టింది. ఏటా 5కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయం అంటే బేగంపేట ఎయిర్‌పోర్టు మాత్రమే. హైదరాబాద్‌ వచ్చిపోయే వారిలో చాలా మంది ఈ ఎయిర్‌పోర్టు మీదుగానే రాకపోకలు కొనసాగించేవారు. అప్పట్లో విమానాశ్రయం నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒక విమానం గాల్లోకి ఎగిరేది. రోజుకు పదుల సంఖ్యలో మాత్రమే విమానాలు తిరిగేవి. అయితే ఇప్పుడు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్ర స్తుతం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతి 3.6 నిమిషాలకు ఒక విమానం టేకాఫ్‌ తీసుకుంటోంది. రోజు 400 విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. నిత్యం 50వేల మంది ప్రయాణికుల చొప్పున ఏటా 2 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిలిచింది.

ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలుపుతున్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లిd, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా తదితర నగరాలకు సులభంగా ప్రయాణించేలా విమానాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ఏ ప్రాంతానికైనా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి కేవలం 2 గంటల్లో ప్రయాణించే వీలుంది. ఈ పరిస్థితుల్లో శంషాబాద్‌ విమానాశ్రయం మీదుగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టును విస్తరించి ఏటా 5 కోట్ల మంది రాకపోకలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు రూ.8,500 కోట్లతో 1500 ఎకరాల్లో ఏరో జీఎంఆర్‌ సిటీని నిర్మిస్తోంది. దేశ, విదేశీ ప్రయాణికులు బస చేసేందుకు వీలుగా సర్వీస్‌ అపార్ట్‌ మెంట్లు, హోటళ్లు, ఐటీ సంస్థల కార్యాలయాలు, కన్వెన్షన్‌ సెంటర్లు, వినోద కేంద్రాలు, ఆసుపత్రులను నిర్మించనున్నారు. ప్రతి 1.20 కోట్ల మంది ప్రయాణం సాగించేలా 2008లో ప్రారంభమైన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి 2016-17 లో 1.52కోట్ల మంది రాకపోకలు కొనసాగించారు. 2017-18 నాటికి ఈ సంఖ్య 1.83కోట్లకు చేరింది. 2018-19లో మొదటి టర్మినల్‌ నుంచి రికార్డుస్థాయిలో 2.14కోట్ల మంది ప్రయాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement