Tuesday, November 26, 2024

ప్రాంతాల‌కు అతీతంగా శివారు మున్సిపాలిటీల అభివృద్ధి : మంత్రి కేటీఆర్

ప్రాంతాల‌కు అతీతంగా శివారు మున్సిపాలిటీల అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని మ‌హేశ్వ‌రంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…న‌గ‌ర శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌న్నారు. ఇవాళ ఒక్క‌రోజు రూ.400కోట్ల ప‌నుల‌కు శ్రీకారం చుట్టామ‌న్నారు. మీర్ పేట్, బడంగ్ పేట్ లో రోడ్ల విస్త‌ర‌ణ ప‌నులు, నాన్ వెజ్, వెజిట‌బుల్ మార్కెట్ కు శంకుస్థాప‌న చేశామ‌న్నారు. అలాగే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఎయిర్ పోర్టుకు ప్ర‌త్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. శివారు మున్సిపాలిటీల్లోనూ బ‌స్తీ ద‌వాఖాన‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement