ముంబైలో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ మేరకు రూ. 500కోట్ల విలువైన డ్రగ్స్, కోటికిపైగా విదేశీ సిగరేట్లను కస్టమ్స్ ని అధికారులు ధ్వంసం చేశారు. కాగా ఈ సంఘటన తలోజా ప్రాంతంలోని డంప్ యార్డ్ వద్ద చోటు చేసుకుంది. ధ్వంసం చేసిన వాటిలో 293 కిలోల హెరాయిన్, 50 కిలోల మెఫెడ్రోన్ ఉన్నాయని వాటి విలు బహిరంగ మార్కెట్లో రూ.500కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ (జోన్-3) రాజేశ్ సనన్ వెల్లడించారు. అలాగే 19 మెట్రిక్ టన్నుల విదేశీ సిగరెట్లు సైతం ధ్వంసం చేశామని, వాటి విలువ రూ.15కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPC) చట్టంలోని నిబంధనల ప్రకారం దాడులు చేసినట్లు పట్టుకున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రతినిధుల సమక్షంలో డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement