టీం ఇండియా, -వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు దంచికొడుతోంది. ఇండియా బౌలర్లు ఏమాత్రం వారిపై ఎఫెక్ట్ చూపడం లేదు. 18ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ జట్టు3 వికెట్లు మాత్రమే కోల్పోయి136 పరుగులతో పటిష్టమైన స్టేజీకి చేరింది. కాగా, బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ 15 ఓవర్‌లో భువనేశ్వర్ వేసిన తొలి బంతిని ఆడిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ సిక్సర్ కొట్టాడు. దీంతో వెస్టిండీస్ స్కోర్ 105 పరుగులకు చేరింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ క్లీన్ బౌల్డ్ తో క్రీజ్‌లోకి వచ్చిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ నిలకడగా.. మరో ఓపెనర్ క్లే మేయర్స్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో 14వ ఓవర్‌లో క్లే మేయర్స్ మూడు ఫోర్లు బాదాడు. అంతకుముందు 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది. కాగా, ఈ క్రమంలో పూరన్ (22) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
ఇక.. టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, క్లేమేయర్స్ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. హార్దిక్ పాండ్యా 7.2 ఓవర్‌లో బ్రాండన్ కింగ్.. క్లీన్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటి వరకు వెస్టిండీస్ 57 పరుగులు చేసింది. దీంతో కెప్టెన్ నికోలస్ పూరన్ క్రీజ్‌లోకి వచ్చి రెండు పరుగులు చేశాడు. మరో ఓపెనర్ క్లే మేయర్స్ 38 పరుగులు చేశాడు.