భారత్ లో పర్యటించనున్నారు ఉక్రెయిన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్ జాపరోవా.ఆమె నాలుగు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ ప్రతినిధులు భారత్ కు అధికారిక పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ వరకు ఆమె ఇండియాలో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ శనివారం అధికారిక ప్రకటన చేసింది. తన పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సంజయ్ వర్మతో జాపరోవా సమావేశమవుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఇరువురూ చర్చలు జరుపుతారు.రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ కి తీరని నష్టం కలిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement