కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా మహారాష్ట్రలో పదిమందికి పైగా మంత్రులు, 20మంది ఎమ్మెల్యేలు పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో అసెంబ్లీ సమావేశాలని తగ్గించారు. పది మంది మంత్రులు,20మందికి పైగా ఎమ్మెల్యేలకి కరోనా టెస్ట్ లు నిర్వహించగా వారికి పాజిటీవ్ గా తేలిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటికే 8వేల 067కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఇటీవల అసెంబ్లీ సమావేశాలను కుదించారు. కొత్త వేరియంట్ (ఓమిక్రాన్) వేగంగా వ్యాపిస్తుందని గుర్తుంచుకోవాలని అజిత్ పవార్ తెలిపారు.
అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు కొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. మహారాష్ట్రలో, ముంబై , పూణేలలో కేసులు పెరుగుతున్నాయన్నారు. పెర్నే గ్రామంలోని జయస్తంభ్ సైనిక స్మారకాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచుతోందని పవార్ అన్నారు. “రోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే, కఠినమైన ఆంక్షలు ఉంటాయి. కఠినమైన పరిమితిని నివారించడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..