Tuesday, November 26, 2024

Demonetization – అవే నోట్లు … మళ్లీ పాట్లు

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ సందర్భంలో గతంలో చోటు చేసుకున్న ఇబ్బందులు పునరా వృతం కావని కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌లు ప్రకటిం చాయి. కానీ ప్రజలు తమ వద్దనున్న రూ.2వేల నోట్ల మార్పిడికి అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నా రు. ఇందుకు ప్రధాన కారణం ప్రెస్‌మీట్లు పెట్టి ఉప సంహరణ ద్వారా ప్రజలకెలాంటి ఇబ్బందులుండ వని ప్రకటించిన ప్రభుత్వం, ఆర్‌బీఐలు ప్రజలు ఇబ్బందులెదుర్కోకుండా చేపట్టాల్సిన చర్యలపై దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేక పోవడమే. దేశంలో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకులన్నీ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిఉన్నాయి. స్వయం నిర్ణయాధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఆర్థిక నిర్వహణకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌తో పాటు ప్రధాని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కంటే కూడా ఇవి తమ పాలనా కమిటీ నిర్ణయాలకు మాత్రమే కట్టు బడి పనిచేస్తాయి. ఈ పాలనా కమిటీలన్నీ ఛైర్మన్‌ అధ్యక్షతన చర్చించి నిర్ణయాలు తీసుకొంటున్నా యి. ప్రజలెన్నుకున్న కేంద్ర ప్రభుత్వం, ఆర్ధిక వ్యవ స్థల్ని పర్యవేక్షిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లు రెండు వేల నోట్ల ఉపసం#హరణ సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలపై ఈ బ్యాంకుల నిర్వ#హణా మండళ్ళకు సూచనల్ని మాత్రమే జారీ చేశాయి. దీంతో ఇవేవీ ప్రభుత్వ నిబంధనల్ని ఆదేశాలుగా భావించి అమల్లోకి తేలేదు. రెండు వేల నోటు మార్పిడికొచ్చే ఖాతాదార్లను పలు నిబంధనల పేరిట ఇవి ఇబ్బందులు పెడుతున్నాయి.

రిజర్వ్‌ బ్యాంకు రూ. 40 వేల లోపు విలువ కలిగిన రెండు వేల రూపాయల నోట్లను ఎటువంటి ఆధారాలు చూపాల్సిన అవసరం లేకుండానే మార్పిడి చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే బ్యాంకులు దీన్ని ఆమోదించడంలేదు. రెండు వేల రూపాయల నోటు ఒక్కటి మార్చాలన్నా విధిగా ఆధార్‌ నెంబర్‌ను సమర్పించాలి. అలాగే ఆ బ్యాంక్‌లోని ఖాతాదార్లకు మాత్రమే మార్పిడి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. అది కూడా ఆ మొత్తాన్ని వారి సొంత ఖాతాల్లో జమ చేసుకోవాల్సొస్తోంది. ఆ సమయంలో ఖచ్చితంగా రెండు వేల రూపాయల నోటు వివరాల్ని డినామినేషన్‌లో పేర్కోవాలి. ఈ ఖాతాలన్నీ ఆదాయ పన్నుశాఖతో అనుసంధానం చేయబడున్నాయి. దీంతో ఇలా జమయ్యే ప్రతి నోటుకు సంబంధించిన వివరాలు ఆదాయపన్ను శాఖకు వెళ్తున్నాయి. భవిష్యత్‌లో ఆయా ఖాతాదార్లను ఆదాయపన్ను శాఖ నిలదీసే ప్రమాదం నెలకొంది. ఈ మొత్తాన్ని ఆదాయపు జాబితాలో ప్రకటించని మొత్తంగా ఐటి శాఖ భావిస్తుంది. ఇందులో 30 శాతాన్ని పన్నుగా చెల్లించమని ఆదేశాలి వ్వొచ్చు.. దీనిపై అపరాధ రుసుం, కొన్ని సందర్భాల్లో ఖాతాదార్లు జ్కెలుకెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. బ్యాంకులు రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి ఇన్ని నిబంధనల్ని అమలు చేస్తుండడంతో హూటళ్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ నోటును అంగీకరించడంలేదు. వీలుంటే రూ 500, లేదా అంతకు క్రింది మారకపు విలువ కలిగిన నోట్లను చెల్లించమని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆన్‌ లైన్‌ పేమెంట్లకు మొగ్గు చూపుతున్నారు. రూ 2వేల నోట్లను తీసుకుంటే వాటిని తిరిగి బ్యాంకులకు బదలీ చేసే సమయంలో సవాలక్ష నిబంధనల్ని ఎదుర్కొని జవాబుదారీ కావాల్సొస్తుందన్న భయం వారికేర్పడింది. ఈ అంశాన్ని రూ. 2 వేల నోట్ల ఉపసం హరణ సమయంలో కేంద్రం, ఆర్‌బిఐలు స్పష్టంగా అంచనా లేయలేదు. ఇప్పటికైనా రిజర్వ్‌బ్యాంక్‌ దీనిపై బ్యాంకులన్నింటికి స్పష్టత నివ్వాలి. రూ.40 వేల లోపు విలువ కలిగిన రూ.2 వేల రూపాయల నోట్లను ఎటువంటి నిబంధనల్లేకుండా మార్పిడికి అనుమతించాలంటూ ఆదేశాలివ్వాలి. ఇందుకనుగుణంగా బ్యాంక్‌ ల పాలకమండళ్లు తీర్మానం చేసి శాఖలన్నింటికి పంపేలా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో గతంలో రూ.1000 రూ.500 నోట్ల ఉపసం#హరణలో ప్రజలెదుర్కొన్న ఇబ్బందులు పునరావ్సతమయ్యే ప్రమాదముంది. ఇది జాప్యమైతే తమ వద్ద దాచుకున్న కొద్దిపాటి రూ. 2 వేల నోట్లకు తగిన వివరణ ఇవ్వలేక, అలాగని వాటిని వదులుకోలేక కోట్లాదిమంది సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement