Monday, November 18, 2024

ప్ర‌జాస్వామ్య స‌ద‌స్సుకి భార‌త్ కి ఆహ్వానం..చైనా.. ర‌ష్యాల‌కు నో ఇన్విటేష‌న్ ..

ప్ర‌జాస్వామ్య స‌ద‌స్సుకి భార‌త్ కి ఆహ్వానం అందింది..డిసెంబ‌ర్ 9,10తారీఖుల్లో అమెరికా అధ్య‌క్ష‌త‌న ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. కాగా ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ శాఖ మొత్తం 110 దేశాలకు ఆహ్వనం పంపింది. దీంట్లో భాగంగానే ఈ సదస్సుకు భారత్ ను కూడా ఆహ్వనించింది. అయితే ప్రపంచంలో అగ్ర దేశాలుగా ఉన్న చైనా, రష్యాలకు మాత్రం అమెరికా ఆహ్వనం పంపలేదు. నాటోల సభ్య దేశంగా ఉన్న టర్కీని కూడా అమెరికా పట్టించుకోలేదు. దక్షిణాసియా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకా దేశాలను కూడా అమెరికా ఆహ్వానించలేదు. అమెరికా ప్రజాస్వామ్య సదస్సుకు ఆహ్వనించిన దేశాల్లో దేశాల్లో భారత్, పాకిస్థాన్ తోపాటు ఇరాక్ కూడా ఉంది. ఆసియా నుంచి జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలను అమెరికా ఆహ్వానించింది. వియత్నాం, థాయ్ లాండ్ దేశాలకు ఆహ్వానం లేదు. అయితే ఈ సమావేశానికి చైనాతో ఆహ్వానించకపోవడంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నిరంకుశంగా వ్యవహరిస్తుండంతోనే ప్రస్తుతం అమెరికా ఈ దేశాన్ని ఆహ్వనించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement