Saturday, November 23, 2024

బాలకృష్ణకి ‘పద్మభూషణ్’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ – పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి

కడప : సినీ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022 నూతన సంవత్సర క్యాలండర్ ను శ్రీనివాసులరెడ్డితో పాటు టిడిపి నాయకులు హరిప్రసాద్, పీరయ్యలు ఆవిష్కరించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసునిగా సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ రాణిస్తూ పలువురి బాలకృష్ణ మన్ననలు పొందారన్నారు.అలాగే తనతల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించడాన్నితట్టుకోలేక, నాలాంటి బాధ ఇంకెవ్వరూ పడకూడదనే ఉద్దేశంతో తన తల్లి పేరిట క్యాన్సర్ ఆసుపత్రిని 2000 సంవత్సరం, జూన్ 22 వ తేదీన ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి సామాజిక సేవ చేస్తూ వున్నారన్నారు. హిందూపూర్ శాసనసభ్యునిగా కొనసాగుతూ ఆ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశార‌న్నారు.

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అడుగు జాడల్లో నడుస్తూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుండి.. నేటి వరకూ పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తూ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
సినీ పరిశ్రమలోనూ,రాజకీయ రంగంలోనూ సేవ చేస్తూ బసవతార‌కం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సామాజిక సేవ చేస్తూ ..ప్రజల అవసరాలు తీరుస్తున్న సేవకుడు నందమూరి బాలకృష్ణ అని పేర్కొన్నారు.అలాంటి సేవకునికి *పద్మభూషణ్” అవార్డు ఇవ్వాలని ఘంటాపథంగా డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ రాజశేఖర్, బాలకృష్ణ అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షుడు సౌదాగిరి వెంకటరమణ, దేవుని కడప చంద్ర,ప్రసాద్ నాయుడు,చికెన్ భాష,ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement