ధేశంలో కరోనా డెల్టా ప్లస్ తో మరో మరణం సంభవించింది. ముంబైలో డెల్టా ప్లస్ తో 63 ఏళ్ల మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూలై 21వ తేదీన ఆ వ్యక్తి పాజిటివ్‌గా తేలింది. ఆ పేషెంట్‌కు డయాబెటిస్‌తో పాటు పలు రకాల రుగ్మతలు ఉన్నాయని అధికారులు చెప్పారు. జూలై 27వ తేదీన వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత ఆ మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఇప్పటికే ముంబైలో ఏడుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ రిపోర్ట్ బుధవారం వచ్చిది. ఆమెతో సన్నిహత సంబంధం కలిగి ఉన్న మరో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే మృతిచెందిన వ్యక్తికి మాత్రం ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు చెప్పారు. ఆ మహిళకు ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. స్టిరాయిడ్స్, రెమ్‌డిసివిర్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు. గత నెలలో రత్నగిరకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఆ వేరియంట్‌కు బలయ్యారు.
ఇది కూడా చదవండి: ఆరింటిలో మూడు మాత్రమే..ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై కీలక నివేదిక