నిండు గర్భిణి అయిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పురిటినొప్పులు రావడంతో డాక్టర్లు ఈజీ డెలివరీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులతొ చాలామంది అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ఉచిత వైద్యానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తోంది.
ఈ విషయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హరిప్రియా నాయక్ని అభినందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందడంతో సామాన్య ప్రజలకు మరింత భరోసా కల్పించినవారమవుతామన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఎమ్మెల్యే హరిప్రియ ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే ఖమ్మం జాయింట్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సతీమణి, ములుగు అడిషనల్ కలెక్టర్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే తమ కాన్పులను చేసుకుని సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.