పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ వెళ్ళనున్నారు. నవంబర్ 22 నుంచి 25వరకు ఆమె పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో మమతా బెనర్జీ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత దేశ రాజధానిలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీల మద్దతు కూడా గట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో మమతా బెనర్జీ ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి.
Advertisement
తాజా వార్తలు
Advertisement