దేశ రాజధాని ఢిల్లీలో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు వర్షాలు జనాలను వణికిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులకు కరోనా వైరస్ తోడు కావడంతో మరింత ఇబ్బందిపడుతున్నారు ఢిల్లీ ప్రజలు. ఈ డిఫరెంట్ సిచ్యుయేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ చుట్టుముటుడుతున్నాయని గగ్గోలుపెడుతున్నారు. కాగా, ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఈ రోజు ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. రోజంతా వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని 19 జిల్లాలకు మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం ఉంటుందని, ఉరుములతో కూడిన జల్లులుంటాయని పేర్కొంది. కాగా, ‘ఆరెంజ్’ అలర్ట్ కూడా జారీ చేసింది.
గ్వాలియర్, శివపురి, గుణ, దతియా, అశోక్ నగర్, షియోపూర్, మోరెనా, భింద్, నీముచ్, మందసౌర్, రాల్తామ్, రాజ్‌గఢ్, అగర్ మాల్వా, విదిషా, తికమ్‌గఢ్, ఛతర్‌పూర్, నివారి, దామోహ్ మరియు సాగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) ట్వీట్ చేసింది, “మొత్తం ఢిల్లీ, NCR (లోని దేహత్, హిండన్ AF స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌ఘర్) కురుక్షేత్ర పరిసర ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురుస్తుంది.” అని వాతావారణ శాఖ అధికారి తెలిపారు.