Wednesday, November 20, 2024

ఢిల్లీ యూనివర్సిటీ PG ఫోర్త్ మెరిట్ లిస్ట్ రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

DU PG 4th Merit List 2021: ఢిల్లీ విశ్వవిద్యాలయం నాలుగో జాబితా పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు, MA అప్లైడ్ సైకాలజీ, MA బౌద్ధ అధ్యయనాలు, MA ఎకనామిక్స్, MA ఇంగ్లిష్, MA జాగ్రఫీ, MA హిందీ, MA హిస్టరీ, MA లింగ్విస్టిక్స్, MA సైకాలజీ, MA సంస్కృతం, MA ఉర్దూ, MA/ M.Sc మ్యాథ్స్, MA/ M.Sc స్టాటిస్టిక్స్, M.Com, M.Sc జెనెటిక్స్, M.Sc జియాలజీ, M.Sc జువాలజీ, మాస్టర్ ఆఫ్ జర్నలిజం, M.Sc మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఆపరేషనల్ రీసెర్చ్, M.Sc- Ph.D కంబైన్డ్ డిగ్రీ కోర్సు- బయోమెడికల్ సైన్సెస్, B.Ed. కి సంబంధించిన మొత్తం మెరిట్ జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. admission.uod.ac.in ఇతర కోర్సుల కోసం ఈ వెబ్ లో చెక్ చేసుకోవచ్చు.

ఢిల్లీ యూనివర్సిటీ పీజీ నాలుగో మెరిట్ జాబితా 2021 ఆధారంగా డిసెంబరు 27 నుండి 28 వరకు డిల్లీ యూనివర్సిటీ కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్లను ఆమోదిస్తాయి. డియు పిజి 4వ మెరిట్ జాబితా 2021కి అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 29 సాయంత్రం 5 గంటల వరకు చాన్స్ ఉంటుంది. SC, ST, OBC-NCL, EWS, PwBDకి చెందిన అభ్యర్థులు ఫోర్త్, స్పాట్ అడ్మిషన్ల కింద అడ్మిషన్ కోరే సమయంలో తప్పనిసరిగా అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ చివరి రౌండ్‌లో ఎటువంటి అండర్‌టేకింగ్ అనుమతించబడదని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది.

DU PG 4వ మెరిట్ జాబితా 2021 చెక్ చేసుకోవడనాకి..

  1. అధికారిక వెబ్‌సైట్ – admission.uod.ac.inని ఓపెన్ చేయాలి..
  2. కోర్సు వారీగా మెరిట్ జాబితాపై క్లిక్ చేయండి
  3. ఎంచుకున్న అభ్యర్థుల జాబితాను కలిగి ఉన్న PDF స్క్రీన్‌ కనిపిస్తుంది
  4. మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోండి, తర్వాత సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఎంపికైన అభ్యర్థులు PG అడ్మిషన్ పోర్టల్స్ కి లాగిన్ అవ్వాలి. ప్రోగ్రామ్‌ను ఎంచుకోవాలి. కళాశాలల ప్రాధాన్యతా క్రమం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్‌లను ధ్రువీకరించిన తర్వాత కళాశాల విభాగాధిపతి లేదా ప్రిన్సిపాల్ అడ్మిషన్‌ను ఆమోదించి, సీటును కన్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత, అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన వారు తాత్కాలికంగా అడ్మిషన్‌గా పరిగణించబడతారు. పీజీ ప్రవేశానికి సంబంధించిన వివరాల కోసం, admission.uod.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని ఢిల్లీ యూనివర్సిటీ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement