Saturday, November 23, 2024

Breaking: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 362కు చేరింది. దీంతో ఒమిక్రాన్ కట్టడిపై ఢిల్లీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వీకెండ్ కర్ఫ్యూ పెట్టే దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒమిక్రాన్ కట్టడిపై వర్చువల్ పద్ధతిలో సమావేశం అయిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వీకెండ్ కర్ఫ్యూపై చర్చించారు.

కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో 4,099 కొత్త కేసులు నమోదు కాగా.. ఒక మరణం సంభవించింది. కరోనా కట్టడికి ఇప్పటికే ఢిల్లీలో రెడ్ అలర్ట్ అంక్షలు అమలు చేస్తున్నారు. దుకాణాలు, మాల్స్, సెలూన్‌ల మూసివేశారు. ప్రజా రవాణా 50 శాతం ఆక్యూపెన్సీతో నడుపుతున్నారు. వివాహాలు, అంత్యక్రియలపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, కరోనా కేసులు గణనీయంగా పెరగడంతో వీకెండ్ కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు జనవరి 8 నాటికి ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య 9 వేల వరకు నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు తెలిపాయి. దేశంలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌లు కేసులు నమోదు అవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement