ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం టి ఆర్ ఎస్ అధికారుల ప్రయత్నాలు చేశారు. కాగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ,గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీ వెళ్లింది.వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, అదనపు ధాన్యం కొనుగోలుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదం తెలపలేదు కేంద్రం.యాసంగి వరి ధాన్యం విషయంలో రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ పార్లమెంటు సాక్షిగా తప్పుడు ప్రకటనలతో కేంద్రం ద్వందవిధానాలు అనుసరిస్తుంది. తెలంగాణ రైతుల ప్రయోజనాల గురించి పట్టుబట్టకుండా కేంద్రం చెప్పినట్లు ఆడుతున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు, నేతలు అని టిఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు.
తెలంగాణలో యాసంగిలో పండే వడ్లు బాయిల్డ్ రైస్ కు మాత్రమే పనికొస్తాయి అని తెలిసినా రైతుల ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు అని మండిపడ్డారు.రాష్ట్ర బీజేపీ నేతల అసమర్దత, కేంద్రం సవతిప్రేమతో సతమతమవుతోంది తెలంగాణ రైతాంగం. రైతుల ప్రయోజనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీకి పయనమయ్యారు మంత్రుల బృందం.రేపు, ఎల్లుండి కేంద్ర మంత్రి, ప్రధానమంత్రితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. మరి మోడీ అపాయిట్ మెంట్ దొరుకుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..