Friday, November 22, 2024

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గినా లాక్ డౌన్ పొడిగింపు!

కరోనా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను మరో వారం పొడిగించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీలో జూన్ 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే, కొన్ని షరతులతో ఉత్పత్తి, నిర్మాణ రంగ వ్యాపారాలు పునఃప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. అయితే, వ్యాపార సంస్థలు చాలా ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు ఒకేసారి సమూహంగా విధుల్లోకి రాకుండా, షిప్టులలో పని చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.

ఢిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తోంది. ఢిల్లీలో శనివారం కొత్తగా 956 కరోనా కేసులు నమోదు కాగా.. 122 మంది మృతి చెందారు. గత రెండు నెలల గణాంకాలను పరిశీలిస్తే, ఢిల్లీలో నిన్న అత్యంత తక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మార్చిలో 36 శాతం పాజివిటీ రేటు ఉండగా.. ప్రస్తుతం 1.19 శాతానికి పడిపోయింది. మార్చి 22వ తేదీన ఢిల్లీలో 21,823 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం వెయ్యికి లోపే కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతో రానున్న రోజుల్లో లాక్ డౌన్ సడలింపులు పెంచుతామని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement