Saturday, November 23, 2024

ఢిల్లీలో కరోనా మారణకాండ.. ఒక్కరోజే 306 మంది మృతి!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఓవైపు వేలళ్లో కరోనా కేసులు నమోదు అవుతుంటే.. మరోవైపు వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్న వైరస్ ఉధృతి మాత్రం ఆగడం లేదు. నిన్న ఒక్క రోజే ఏకంగా 306 మంది మృతి చెందారు. వారం రోజుల క్రితం 104గా ఉన్న మరణాల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత పదిరోజుల్లో ఏకంగా 1,750 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోవడానికి యూకే స్ట్రెయినే ప్రధాన కారణమని తాజాగా వెల్లడైంది. మార్చి చివరి వారంలో శాంపిళ్ల‌ను విశ్లేషించ‌గా అందులో సగం వరకు బ్రిటన్‌ వేరియంట్‌వే కావడమే ఇందుకు నిదర్శనమని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నిపుణులు అంచనాకు వచ్చారు. ఢిల్లీలో మార్చి రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్‌ బయటపడగా.. చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని వెల్లడించారు

మరోవైపు, కరోనా మృతుల అంత్యక్రియలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని సీమాపురి శ్మశానవాటికలో అంత్యక్రియలకు చోటులేక పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సామూహిక దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement