స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందు ఢిల్లీ పోలీసులు భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకుని, నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు.
పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. నలుగురు అనుమానితులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టళ్లు, 50 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులను రాజ్‌వీర్ ధీరజ్ (హత్రాస్), వినోద్ (ఫిరోజాబాద్, యూపీ), ధర్మేంద్ర భరతాల్ (ఢిల్లీ)గా గుర్తించారు. సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండిః కాంగ్రెస్ దళిత దండోరా సభ వాయిదా ?: రేవంత్ కి కోమటిరెడ్డి సహకరిస్తారా?