Saturday, November 23, 2024

India: ఐఎస్​ఐ టెర్రర్​ కుట్ర భగ్నం.. నలుగురు గ్యాంగ్​స్టర్స్​ అరెస్టు​, ఆయుధాలు స్వాధీనం

దేశంలో మతపరమైన అల్లర్లు సృష్టించి, పెద్ద ఎత్తున కోల్డ్​ వార్​ జరిగేలా ప్లాన్​ చేసిన రెండు టెర్రర్​ ముఠాల ఆటను స్పెషల్​ పోలీసులు కనిపెట్టారు. పాకిస్తాన్​కు చెందిన తీవ్రవాద సంస్థ ఐఎస్​ఐ, దానికి అనుబంధంగా పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీలోని యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​ స్పెషల్​ సెల్​ డీసీపీ ఆధ్వర్యంలోని టీమ్​ పట్టుకుంది. ఈ నేరగాళ్లు కెనడాకు చెందిన గ్యాంగ్​స్టర్​ లాండాగా పిలిచే లఖ్​బీర్​ సింగ్ .. అదేవిధంగా పాకిస్తాన్​కు చెందిన ఖలిస్తాన్​ ఉగ్రవాది, రిండాగా పిలిచే హర్విందర్​ సింగ్​ కనుసన్నల్లో ఇండియాలో యాక్టివిటీస్​ చేస్తున్నారని తెలిపారు. ఈ నలుగురు టెర్రరిస్టు షార్ప్​ షూటర్లతోపాటు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు గల టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన నలుగురు షార్ప్ షూటర్లను అరెస్టు చేసినట్లు డీసీపీ మనీష్​ చంద్ర తెలిపారు. అరెస్టయిన నిందితులను లఖ్వీందర్ సింగ్ అలియాస్ మాతృ (31), గుర్జీత్ అలియాస్ గురి (21), హర్మాందర్ సింగ్ (26), సుఖ్ దేవ్ సింగ్ అలియాస్ సుఖా (28)గా గుర్తించారు. ఈ నేరగాళ్లు కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌, టెర్రరిస్ట్​ అయిన లఖ్‌బీర్ సింగ్ ‘లాండా’, పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ ‘రిండా’ సూచనల మేరకు యాక్టివిటీస్​ నిర్వహిస్తున్నారు.

పంజాబ్‌లో ఉగ్రవాద పునరుద్ధరణకు దారితీసే పనులను అమలు చేయడం రిండా, లాండా అంతిమ లక్ష్యాలు. దీని కోసం ISI వారికి చైనా గ్రెనేడ్‌లు, AK-47, MP-5 రైఫిల్స్.. మాజీ చైనా ఆర్మీ స్టాక్‌లతో సపోర్టుగా నిలుస్తోంది. స్పెషల్ సెల్ డీసీపీ మనీష్​ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 24న ఢిల్లీకి చెందిన సరాయ్ కాలే ఖాన్ నుండి కరుడుగట్టిన నేరస్థుడు మాతృని పట్టుకున్నప్పుడు ఇందులో తొలి అరెస్టు జరిగింది. మాతృని ఎంక్వైరీ చేసే క్రమంలో తమకు కొత్త కొత్త వివరాలు, దాని లింకులు దొరికాయని పోలీసు ఆఫీసర్​  చెప్పారు. ఆ తర్వాత అక్టోబర్ 13 న ఢిల్లీలోని ISBT కాశ్మీరీ గేట్ సమీపంలో గుర్జీత్ అలియాస్ గురి యొక్క కదలికలు కనిపించాయి. ఆ తర్వాత అతడిని కూడా పట్టుకున్నట్టు చెప్పారు.

హర్మేందర్, సుఖ్‌దేవ్ సుఖా లాండా.. రిండా కోసం సరిహద్దు కార్యకలాపాలలో చాలా యాక్టివ్​ రోల్​ పోషిస్తున్నాడని  గురి పోలీసులకు వెల్లడించాడు. అక్టోబర్ 18న పంజాబ్‌లోని మోగా నుంచి హర్మేందర్, సుఖ్‌దేవ్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. కొద్ది రోజుల క్రితం అదే సిండికేట్‌లోని మరొక భయంకరమైన సభ్యుడు – దీపక్ అలియాస్ టిను- అక్టోబర్ 1-2న మధ్య రాత్రి పంజాబ్ పోలీసుల కస్టడీ నుండి పారిపోయాడు. కాగా, ఇతడిని రాజస్థాన్‌లోని అజ్మీర్ లో అరెస్టు చేశారు. అతని వద్ద ఐదు అత్యంత పేలుడు శక్తి కలిగిన చైనా హ్యాండ్ గ్రెనేడ్లు లభించాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు సరిహద్దు ఆవల నుంచి డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జారవిడిచేందుకు హర్మేందర్, సుఖా సమన్వయం చేసుకున్నట్లు అరెస్టయిన వారిని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసింది.  డ్రోన్ల ద్వారా జారవిడిచిన AK లు, MP-5 లు, గ్రెనేడ్లు, స్టార్ / బెరెట్టా పిస్టల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా పెద్దమొత్తంలో వారి వద్ద మందుగుండు సామగ్రితోపాటు ఆయుధాలు ఉంటాయని తాము భావిస్తున్నట్టు DCP తెలిపారు.

హైడ్రా అనేది ISI మద్దతు ఉన్న రిండా-లాండా నెట్‌వర్క్ గా పోలీసులు భావిస్తున్నారు. రెండు ప్రత్యర్థి క్రిమినల్ గ్రూపులు భారతదేశంలో రక్తపుటేరులు పారించేలా ఓ కోల్డ్​ వార్​కోసం ప్లాన్​ చేస్తున్నాయని, ఈ క్రమంలో ఈ రెండు గ్రూపులు తమ ఆయుధాలను, మాదకద్రవ్యాలను రిండా, లాండా నుండి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇట్లా ఆయుధాలు మాత్రమే కాకుండా కొత్తగా తయారు చేసిన అనేక మంది నేరస్థులను కూడా ఈ ప్రత్యర్థి ముఠాలు కిరాయి సైనికులుగా ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోందన్నారు. ISI, దాని మద్దతు ఉన్న ఉగ్రవాదులు రిండా, లాండా యొక్క అతిపెద్ద కుట్ర ఏంటంటే.. మతపరమైన విషయంలో అల్లర్లు చెలరేగేలా చేయడం.. భారతీయుల్లో అశాంతిని సృష్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నారని అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement