Tuesday, November 26, 2024

ఢిల్లీ – ముంబై మ‌హాదారి…

న్యూఢిల్లి : ఢిల్లి-ముంబై ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కేంద్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా, రాజస్థాన్‌లోని దౌసా నుంచి ఢిల్లి-దౌసా-లాల్‌సోట్‌ మధ్య పూర్తయిన తొలిదశ రహదారిని జాతికి అంకితం చేశారు. దేశ అభివృద్ధిలో ఇది బలమైన స్తంభంగా నిలుస్తుందని ఆశా భావం వ్యక్తంచేశారు. తొలిదశలో మొత్తం 247 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎనిమిది లేన్లుగా నిర్మించారు. ఇందుకు రూ.10,400 కోట్లు వెచ్చించారు. దీనివల్ల ఢిల్లి-జైపూర్‌ మధ్య ప్రయాణ సమయం ఐదు గంటల నుంచి మూడున్నర గంట లకు తగ్గుతుంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్రం శంకు స్థాపన చేసింది.ఈ రహదారి పూర్తయితే ఢిల్లి-ముంబైల మధ్య ప్రస్త్తుతం ఉన్న దూరం సుమారు 180 కి.మీ. మేర తగ్గుతుంది. విశాలమైన ఈ రహదారి రాజస్థాన్‌ ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సా హాన్ని అందిస్తుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రటనలో పేర్కొంది. రాజస్థాన్‌లోని దౌసాలో నిర్వహించిన కార్యక్రమ ంలో, రూ.18,100 కోట్లతో చేపట్టనున్న నాలుగు జాతీయ రహ దారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇండి యాలో అభివృద్ధి, కనెక్టివిటీ ప్రాధాన్యతను ప్రధాని వివరిం చారు. దేశవ్యాప్తంగా అనేక ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాలు కొనసాగు తున్నాయని, ఇవి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని తెలిపారు.
ఢిల్లి-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే 1,386 కి.మీ. పొడవుతో భారత దేశంలోనే అతిపొడవైనది. ఢిల్లి-ముంబై నగరాల మధ్య ప్రయాణ దూరాన్ని 12శాతం, ప్రయాణ సమయం 50శాతం తగ్గుతుంది. ప్రస్తుతం 24 గంటల ప్రయాణ సమయం ఈ రహ దారి ద్వారా 12 గంటలకు తగ్గుతుంది. ఈఎక్స్‌ప్రెస్‌ వే ఢిల్లి, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర గుండా వెళ్తుం ది. కోటా, ఇండోర్‌, జైపూర్‌, భోపాల్‌, వడోదర, సూరత్‌ వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఇది 93 గతిశక్తి ఎకనామిక్‌ నోడ్స్‌, 13 పోర్టులు, 8 ప్రధాన విమానాశ్రయాలు, 8 మల్టిd మో డల్‌ లాజిస్టిక్స్‌ పార్కులతోపాటు కొత్తగా రాబోయే గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలైన జేవార్‌, నవీముంబై, జేఎన్‌పీటీలకు కూడా సేవలు అందించనుంది. ఈ రహదారి నిర్మాణం కోసం ఐదు రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. సుమా రు రూ లక్ష కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ఎక్స్‌ ప్రెస్‌వే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, వీకే సింగ్‌, గజేంద్ర షెకావత్‌ తదితరులు పాల్గొన్నారు. రాజ స్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, హర్యానా సీఎం ఖట్టర్‌ వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో ప్రసంగించారు. జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసంనుంచి గెహ్లాట్‌ కార్యక్ర మంలో పాల్గొనగా, నుహ్‌ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఖట్టర్‌ ప్రసంగించారు.
గెహ్లాట్‌పై చురకలు
ఢిల్లి-ముంబై ఎక్స్‌ప్రెస్‌ హై వే ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృ త్వంలోని కేంద్రం చేస్తున్న సహకారాన్ని వివరిస్తూ, సరిహద్దు గ్రామాల అభివృద్ధిని కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్‌ పనిచేయదని, మరెవ్వరినీ పనిచేయ నివ్వదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న ప్పుడు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి గెహ్లాట్‌ చేసిన పొరపాటును ఎత్తిచూపారు. కొత్త బడ్జెట్‌కు బదులుగా అసెంబ్లిdలో గతేడాది బడ్జెట్‌ను చదవడంపై విరుచుకుపడ్డారు. ఎవరైనా తప్పులు చేయవచ్చు, కానీ కాంగ్రెస్‌కు దృష్టి లేదు. బడ్జెట్‌ ప్రకటనలు కేవ లం కాగితాలపైనే ఉంటాయి తప్ప ప్రజలకు చేరడం లేదు. అత ను (మిస్టర్‌ గెహ్లాట్‌) గతేడాది బడ్జెట్‌ను సమర్పించాడు. దానిని ఏడాది పొడవునా భద్రంగా పెట్టెలో ఉంచాడు అని మోడీ ఎద్దే వా చేశారు. ”మేము అలాంటి ప్రభుత్వం నుండి స్వేచ్ఛను కోరు కుంటున్నాము. ‘వికాస్‌ కి సర్కార్‌ (అభివద్ధి ప్రభుత్వం)’ని కోరుకుంటున్నాము అని ప్రధాని అన్నారు. మన దేశ పురోగతికి, మాకు ఆధునిక మౌలిక సదుపాయాలు-మంచి కనెక్టివిటీ అవసరం. మేము ర#హదారి, రైలుపై దృష్టి సారిం చాము. మా దృష్టి గావ్‌, గరీబ్‌, ఔర్‌ మధ్యం వర్గ్‌ (గ్రామాలు, పేదలు,మధ్యతరగతి) పై ఉంది. మేము మునుపటి ప్రభు త్వాల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము” అని ఆయన అన్నా రు. మౌలిక సదుపాయాల కల్పన మరింత ఉపాధి, వ్యాపా రానికి దారితీస్తుందని అన్నారు.
2024 చివరికి అమెరికాకు దీటుగా: నితిన్‌ గడ్కరీ
సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా కొత్త ఢిల్లిd-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే వెనుకబడిన ప్రాంతాల గుండా వెళుతుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదివారం తెలి పారు. రాజస్థాన్‌లోని దౌసాలో #హవే మొదటి దశ ప్రారం భోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 2024 చివరి నాటికి దేశంలోని రోడ్డు మౌలిక సదుపాయాలను అమెరికా స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని స్వావలంబనతో ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూ డిన మౌలిక సదుపాయాల దిశగా తీసుకెళ్తున్నారు. 2024 చివ రిలో, ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో మేము లక్ష్యాలను చేరుకుంటాం. అమెరికాతో సమానంగా భారతదేశ ర#హదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము అని గడ్కరీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement