Saturday, November 23, 2024

ఢిల్లీలో..2రోజులు లాక్ డౌన్..ఎందుకో తెలుసా..!

ఓ ప‌క్క త‌మళ‌నాడుని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి..మ‌రో ప‌క్క ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకుంటోంది. డేంజర్‌ లెవెల్స్‌ దాటి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది కాలుష్‌యం. ఈ నేపధ్యంలో ఢిల్లీలో ఎయిర్‌ పొల్యూషన్‌పై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటల దగ్ధాన్ని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించారు. రెండు, మూడు రోజుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే రెండు రోజులు లాక్‌డౌన్‌ అంశాన్ని పరిశీలించాలని సూచించారు.వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని..ఇళ్లలో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని పేర్కొన్నారు సీజేఐ. 5వందలుగా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ను కనీసం 2వందలకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటుచేసి..పంటల దగ్ధాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement