ఢిల్లీలో నీటి కాలుష్యం ఉందని, యమునా నది నీరు విషపూరితంగా మారిందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. ఆ నీటితో ఢిల్లీ జల్‌బోర్డ్ అధికారులు స్నానం చేయగలరా? అని ఓ చాలెంజ్ విసిరారు. అయితే.. యమునా నీటిలో ఎట్లాంటి విషపూరిత పదార్థాలు లేవని రుజువు చేసేందుకు ఈ చాలెంజ్‌ని జల్‌బోర్డ్ అధికారి స్వీకరించారు. కాగా, ఇవ్వాల (ఆదివారం) యమునా నది నీటితో ఢిల్లీ జల్ బోర్డు డైరెక్టర్ (క్వాలిటీ కంట్రోల్) అధికారి సంజయ్ శర్మ బహిరంగంగా స్నానం చేయడం గమనార్హం.
ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. యమునా నీరు శుభ్రంగా ఉందని, విషపూరితం కాదని అన్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ యమునా నీటిలో స్నానం చేయాలని తనకు చాలెంజ్ చేశారని జల్ బోర్డు అధికారి సంజయ్ శర్మ చెప్పారు. అయితే.. యమునా నీటిలోని నురగను తొలగించేందుకు విష రసాయనాలను స్ప్రే చేస్తున్నారని బీజేపీ నుంచి నిత్యం ఆరోపణలు వస్తున్నాయని, ఇది తగదని ఆయన సూచించారు.