ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటి అయ్యారు. ముందుగా జగన్ నేటి మధ్యాహ్నం అమిత్ షాను ఆయన ఛాంబర్ లో కలిశారు.. వారిద్దరు 45 నిమషాల పాటు చర్చలు జరిపారు.. ముఖ్యంగా విభజన హామీలపై చర్చలు జరిపినట్లు సమచారం .
. ఆ తర్వాత ప్రధాని మోడీతో జగన్ సమావేశమయ్యారు.. ఈ ఇద్దరు 25 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు.. ఎపికి రావాలసిన బకాయిలతో పాటు ఆర్ధిక సహకారం, విభజన హామీలు తదితర అంశాలను మోడీ దృష్టికి తెచ్చారు జగన్ .. వాటన్నింటికి మోడీ సానుకూలంగా స్పందించారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి..