ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో దాని తోక భాగం నేలకి తాకింది. దాంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. కోల్ కతా – ఢిల్లీ ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ప్రమాదవశాత్తు దాని తోక భాగం రన్ వేపై నేలను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను అధికారులు నిలిపివేశారు.కాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యేంత వరకు విమానంలో ఎలాంటి సమస్యా తలెత్తలేదని తెలిపింది. రన్ వేపైకి చేరుకునే సమయంలో సాధారణం కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలెట్లు గుర్తించారన్నారు. ఈ క్రమంలో ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. కిందకు దిగే సమయంలో విమానం తోక ఒక్కసారిగా రన్ వేను తాకినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీజీసీఏ తన ప్రకటనలో వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement