Monday, November 18, 2024

బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్​ కిట్​పై రాందేవ్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా చూడాలంటూ ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డీఎంఏ) పిటిషన్ దాఖలు చేసింది. రాందేవ్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా చూడాలంటూ పేర్కొంది. కరోనిల్​ కరోనాను నివారించలేదని.. రాందేవ్​ చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పిటిషన్​లో పేర్కొంది. ఈ నేపధ్యంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు రాందేవ్‌కు సమన్లు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. జూలై 13న తదుపరి విచారణ జరగనుంది. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.  

మరోవైపు కరోనా కట్టడిలో అల్లోపతి వైద్యం విఫలమైందంటూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. రాందేవ్ బాబాపై అల్లోపతి వైద్యులు మండిపడుతున్నారు. యోగా పేరుతో డబ్బులు సంపాదించుకుంటున్న రాందేవ్ కు వైద్యం గురించి ఏం తెలుసంటూ విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement