కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయమై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. వ్యాక్సిన్ వేసుకోండి అని కేంద్రం ఫోన్ లలో వినిపిస్తున్న సందేశాన్ని ఎద్దేవా చేసింది. కాల్ చేసిన ప్రతి సారీ మీరు ఆ చిరాకు కలిగించే సందేశాన్ని వినిపిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మీరు ప్రజలకు టీకాలు ఇవ్వడం లేదు. పైగా వ్యాక్సిన్ లగాయేగా (టీకా వేసుకోండి) అని ఫోన్ సందేశం ఇస్తున్నారు. అక్కడ వ్యాక్సినే లేదంటే ‘కౌన్ లగాయేగా’ (ఎవరు వేసుకుంటారు) అని చురకలు వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement