Tuesday, November 26, 2024

భార్య‌తో బ‌ల‌వంతపు శృంగారం నేర‌మా? ఢిల్లీ హైకోర్టు భిన్నమైన తీర్పు.. సుప్రీంకు బదిలీ!

భార్య‌తో బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేర‌మా? అలా రేప్ చేస్తే శిక్ష వేస్తారా? ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువ‌రించింది. ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ అంశంలో విరుద్ధ‌ అభిప్రాయాల్ని వ్య‌క్తం చేసింది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య రేప్ జ‌రిగితే దాన్ని నేరంగా ప‌రిగ‌ణించాలా? లేదా అన్న అంశంలో ఇద్ద‌రు జ‌డ్జిలు విభిన్న వాద‌న‌లు వినిపించారు. భార్య‌ను రేప్ చేస్తే అది నేర‌మే అవుతుంద‌ని జ‌స్టిస్ రాజీవ్ శక్దేర్ త‌న తీర్పులో పేర్కొన్నారు. ఇదే అంశంలో జ‌స్టిస్ హ‌రిశంక‌ర్ భిన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. సెక్ష‌న్ 375 ప్ర‌కారం అది రాజ్యాంగ ఉల్లంఘ‌న కాదు అని ఆయ‌న అన్నారు. భార్య అనుమ‌తి లేకుండా ఆమెతో లైంగిక సంబంధాన్ని కొన‌సాగించ‌డం చ‌ట్ట‌రీత్యా నేర‌మే అవుతుంద‌ని జ‌స్టిస్ రాజీవ్ త‌న తీర్పులో ఆదేశించారు.

అయితే ఈ అభిప్రాయాన్ని జ‌స్టిస్ హ‌రిశంక‌ర్ త‌న తీర్పులో వ్య‌తిరేకించారు. మారిట‌ల్ రేప్ అంశంలో ఇద్ద‌రి జ‌డ్జిల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. ఒక‌వేళ భార్య మైన‌ర్ కాక‌పోతే, ఆమెతో జ‌రిగే శృంగారం రేప్ కాదు అని చ‌ట్టం స్ప‌ష్టం చేస్తోంది. ఈ అంశంలో గ‌తంలో ప‌లుమార్లు ఢిల్లీ కోర్టు వాద‌న‌లు జ‌రిపింది. ఆ త‌ర్వాత ఈ కేసులో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కూడా కోర్టు కోరింది. అయితే జ‌న‌వ‌రి 21వ తేదీన తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధ‌ర్మాస‌నం ఇవాళ దాన్ని వెల్ల‌డించింది. తీర్పులో ఏకాభిప్రాయం లేక‌పోవ‌డంతో.. ఈ కేసును సుప్రీం కోర్టుకు ట్రాన్స‌ఫ‌ర్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement