ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు పలువురు విద్యార్థులు పై అంతస్తుల్లోని కిటికీల నుంచి వైర్ల సపోర్టుతో కిందకు దిగడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సంఘటన న్యూఢిల్లీలోని ముఖర్జీ నగర్లో చోటుచేసుకుంది. ముఖర్జీ నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని.. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 12.27 గంటలకు కాల్ వచ్చిందని, మొత్తం 11 ఫైర్ టెండర్లను సేవలో ఉంచామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్నిమాపక శాఖ షేర్ చేసిన వీడియో.. ప్రజలు, ఎక్కువగా విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది కిటికీల ద్వారా రక్షించబడటం చూడవచ్చు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement