రైతుల కోసం టీఆర్ ఎస్ పార్టీ ధర్నా చేయనుందని రైతుబందు ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మార్కెట్ లను మూయాలని కేంద్రం ఆలోచన…కానీ టిఆర్ఎస్ సర్కార్ రైతుల దగ్గరికి మార్కెట్ ను తీసుకెళ్లిందని గుర్తు చేశారు . బిజెపి మాటలు విని… రైతులు మోసపోవద్దని కోరారు. చెవిలో పువ్వు ఉన్న నేతలకు పండిన పంట కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. బిజెపి నేతలకు దమ్ము ఉంటే యాసంగి పంట కొంటామని కేంద్రంతో చెప్పించాలని…. వడ్లు వెయ్యలా లేదా కేంద్రం తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు బిజెపి ధర్నాలు చేయాలన్నారు…రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు కాదని ఫైర్ అయ్యారు. బిజెపి ధర్నాలో పాల్గొన్నది రైతులు కాదు…ఆ పార్టీ కార్యకర్తలు అని చురకలు అంటించారు.నవంబర్ 12 న 10 గంటల నుంచి ఒంటి గంట వరకు రైతుల కోసం తాము ధర్నా చేస్తున్నామన్నానరు… తెలంగాణ రాష్ట్రంలోని… అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేస్తామని.. టిఆర్ఎస్ ధర్నా కాబట్టి నేతలు ,కార్యకర్తలు పాల్గొంటారన్నారు. అవసరం అయినపుడు ఢిల్లీలో ధర్నాకు పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వం వహిస్తారని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement