Tuesday, October 29, 2024

Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర జలుబుతో బాధపడుతున్న కేజ్రీవాల్… కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షలు సీఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే, తనకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే తాను ఐసోలేషన్‌ లో ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను సంప్రదించిన వారు, ఐసోలేషన్‌ లో ఉండాలి కేజ్రీవాల్ సూచించారు. అలాగే అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. థియేటర్లు, పార్కులు, బార్లు, పార్టీ మీటింగ్స్‌ పై ఆంక్షలు విధించారు. ఢిల్లీలో సోమవారం 4,099 కొత్త కేసులు నమోదయ్యాయి. అధికారిక ప్రకటన ప్రకారం, ఢిల్లీలో పాజివిటి రేటు 6.46 శాతంగా ఉంది. 6,288 మంది కోవిడ్-19 రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement