Friday, November 22, 2024

ఐపీఎల్‌కు దూరమైన రవిచంద్రన్ అశ్విన్.. కారణం ఏంటంటే?

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ అత్యంత కీలకమైన స్పిన్నర్. అయితే ఇకపై ఈ సీజన్‌లో ఐపీఎల్ ఆడనని అశ్విన్ ప్రకటించాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో సూపర్ ఓవర్ వరకు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ గెలిచిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ఇకపై ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల నుంచి విరమించుకుంటున్నాను. నా కుటుంబీకులు, బంధువులు, కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ కష్ట సమయంలో వారికి నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు ఢిల్లీ కాపిటల్స్’ అని ట్వీట్ చేశాడు.

కాగా అశ్విన్ చేసిన ట్వీట్‌కు ఢిల్లీ కాపిటల్స్ టీమ్ కూడా స్పందించింది. ‘మీ కుటుంబం కష్టాల్లో ఉన్న వేళ మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున మీ కుటుంబానికి మద్దతుగా ఉంటాం. మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం’ అని పేర్కొంది. కాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్ 27 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. సూపర్ ఓవర్‌లో కూడా అక్షర్ పటేల్‌తో బౌలింగ్ చేయించారు. కాగా సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement