ఢిల్లీ వాయుకాలుష్యం కట్టడిపై సుప్రీంకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్రం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రజలు,నిపుణుల నుంచి సలహాలు స్వీకరించి చర్యలు చేపట్టాలని కమిషన్ కు సూచనలు చేసింది. ఈ విచారణని ఫిబ్రవరి మొదటివారానికి వాయిదా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మృత్యుఘంటికలు మోగిస్తోంది. కాలుష్యం కన్నీరు పెట్టిస్తోంది. ప్రాణవాయువు విషాన్ని చిమ్ముతోంది. బయట గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. అయితే.. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పలు కఠిన చర్యలు, వాతావరణ మార్పులు ఫలితంగా .. గాలి నాణ్యత కాస్త మెరుగుబడింది. తీవ్ర గాలి కాలుష్య నాణ్యత నుంచి అతి పేలవమైన గాలి కాలుష్య నాణ్యతకు చేరుకుందని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 337 గా నమోదైందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ,వెదర్ ఫోర్ కస్టింగ్ రీసర్చ్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..