ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి తొమ్మిదో అంతస్తులో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలో ఎయిమ్స్ సెట్ (స్కిల్స్, ఈ-లెర్నింగ్, టెలిమెడిసిన్) సౌకర్యం, ఆడిటోరియం ఉన్నాయి. మంటలు చెలరేగిన వెంటనే 22 ఫైర్ టెండర్లను తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. భారీగా ఆస్తినష్టం జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కరోనా నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగాయని డెప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement