Tuesday, November 26, 2024

Breaking: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ‘‘స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఈరోజు మధ్యాహ్నం కొవిడ్‌ పాజిటివ్ పరీక్ష చేయించుకున్నా.. పాజిటివ్ అని తేలింది. దీంతో హోం క్వారంటైన్ లో ఉన్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఓ సీనియర్ బీజేపీ నాయకుడు ట్వీట్ చేస్తూ.. అతనికి “స్వల్ప లక్షణాలు” ఉన్నాయని చెప్పారు.

కాగా, ఇటీవల తనకు కాంటాక్ట్ అయినవారు, సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సురక్షితంగా ఉండాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement