ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అదానీ గ్రూప్‌లో రెండు కంపెనీలపై కీలక నివేదిక విడుదల చేసింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీల్లో పాలనాపరమైన బలహీనతలు ఉన్నాయని, ఈ రెండు కంపెనీల్లో ఆర్ధిక సౌలభ్యానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఈ కంపెనీల రేటింగ్స్ బీబీబీలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ రేటింగ్‌ను ఇక్కడికే పరిమితం చేయబోమని కూడా ఫిచ్ స్పష్టం చేసింది. ఇతర అంశాలు క్రెడిట్ నాణ్యతను మెరుపరిచే పక్షంలో ఈ దశలో నియంత్రిత సమూహాల రేటింగ్‌లు బీబీబీ వద్ద ఉంచబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం అదానీ గ్రాన్స్‌మిషన్, అదానీ పోర్స్ట్ క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉందని తెఇపింది. అదనపు అప్పులపై పరిమితులు, నిర్ధిష్ట నిధుల ప్రవాహ వనరుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.
2022 డిసెంబర్ నాటికి అదానీ గ్రూప్‌లో రేటింగ్ పొందిన దేశీయ కంపెనీల రుణాల్లో చాలా వరకు విదేశాల్లోనే ఉన్నాయని, అవన్నీ సెక్యూర్డ్ రుణాలని ఫిచ్ పేర్కొంది. వీటిలో ఉన్న యూఎస్ డాలర్ బాండ్లు 2024 మధ్య నుంచి మెచ్యుర్ కానున్నాయని పేర్కొంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి మధ్య వచ్చే నగదు ప్రవాహం వల్ల రేటెడ్ సంస్థల ద్రవ్య లభ్యత స్థితి మెరుగుపడుతుందని తెలిపింది. మార్చి 28న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 9 లక్షల కోట్లకు దిగువకు చేరింది. హిండెన్‌బర్గ్ జనవరి 24న నివేదిక వెలువరించిన నాటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గత నెల రోజుల నుంచి నష్టాల నుంచి కొంత మేర కోలుకుంది.
అంబుజా, ఏసీసీ సిమెంట్ కంపెనీల కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణాఈలను సకాలంలో చెల్లించలేదని వార్తలు రావడంతో రెండు రోజుల క్రితం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో అదానీ గ్రూప్ వివర ణ ఇచ్చింది. ఈ రుణాలను సకాలంలోనే చెల్లించామని స్టాక్ ఎక్సేంజీల్లో త్రైమాసికం చివరలో అప్‌డేట్ అవుతాయని తెలిపింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు బుధవారం నాడు పుంజుకున్నాయి.