Friday, November 22, 2024

Allegation: లిక్కర్​ కేసు ఆరోపణలపై పరువునష్టం దావా.. వారిపై నిషేధం విధించేలా కోర్టుకు వినతి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ప్రవేశ్ వర్మ, మంజీందర్ సిర్సాలపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ కేసులో తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) కుమార్తె కవితకు భాగస్వామ్యం ఉందని ఈ ఇద్దరు నేతలు ఆరోపించారు. దీంతో కల్వకుంట్ల కవిత ఇవ్వాల మీడియాతో మాట్లాడారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తమ కుటుంబం పరువు తీసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారని కవిత స్పష్టం చేశారు.

ఇప్పుడు బీజేపీ నేతలపై తాను పరువునష్టం దావా వేస్తానని చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారిపై నిషేధం విధించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నారు. “తమపై చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయని, కేసీఆర్‌తో పాటు, ఆయన కుటుంబాన్ని డిస్ట్రర్బ్​ చేయడం వల్ల దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా ఆయన బలహీనపడతారని వారు భావిస్తున్నరని కవిత అన్నారు. కానీ, అలాంటిదేమీ జరగదన్నారు. తాము ఏమిటో ప్రజలకు తెలుసు. వారి సీఎం గురించి ఇంకా బాగా తెలుసు అని కవిత అన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అంటే ఏమిటి?

ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించిన నిర్ణయాలను కాంపిటెంట్ అథారిటీ నుండి అనుమతి లేకుండా “టెండర్ తర్వాత లైసెన్సుదారులకు అనవసరమైన సహాయాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో” తీసుకున్నారు.

ఇండోస్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు ద్వారా సిసోడియా తన “సన్నిహిత సహచరులకు” కనీసం రెండు చెల్లింపులు జరిగినట్లు ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిఫారసు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సూచన ఆధారంగా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement