Friday, November 22, 2024

TS: గోదారి తీరాన జింకల సందడి.. టూరిజం స్పాట్‌గా మారిన‌ నందిపేట్

నిజమాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం టూరిజం స్పాట్ మారుతోంది. ప‌చ్చ‌ని పొలాలు, కొండ‌లు, ఏపుగా పెరిగిన చెట్ల‌తో ఇక్క‌డి వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. చూడ్డానికి ఎంతో అందంగా అనిపిస్తుంది. గోదార‌మ్మ గ‌ల‌గ‌ల‌లు కూడా చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటాయి. నీటి ప‌ర‌వ‌ళ్ల‌కు ప‌ర‌వశిస్తూ తాగునీటికి వ‌చ్చే జింకలు చూప‌రుల‌కు క‌నువిందు చేస్తుంటాయి. ఏటా వర్షాకాలం సీజ‌న్‌లో గోదావరి తీరాన పెద్ద సంఖ్యలో జింకలు త‌ర‌లివ‌స్తుంటాయి. దీంతో వీటిని చూడటానికి జ‌నం త‌ర‌లివ‌స్తుంటారు.

శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియా ఆహ్లాద‌క‌రంగా మార‌డంతో టూరిజం స్పాట్ గా డెవ‌ల‌ప్ చేయాల‌ని ఈ ప్రాంత లీడ‌ర్లు కోరుతున్నారు. ఈ మేర‌కు అధికారులు కూడా దానికి త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక‌రు వేయ‌డంతో గోదావరి పరిహరక గ్రామాలకు పర్యాటక శోభ రానుంది. టూరిజం అభివృద్ధితో పాటు, అటవీ అభివృద్ధి సంస్థ కూడా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో టూరిజం స్పోర్ట్స్ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్న‌ట్టు కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement