పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరుకుంది. ఫెర్రీ లో అగ్నిప్రమాదం జరగడం వల్ల భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కాలిపోయిన ఓడ శిథిలాల్లో అనేక మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు. ప్రావిన్సు లో ఉన్న మిండనావో దీవిలోని జాంబోంగా సిటీ నుంచి జోలో దీవికి వెళ్తున్న ద లేడీ మేరీ జాయ్ 3 ఫ్రెరీలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆ పడవలో ఉన్న ప్రయాణికులు భయంతో సముద్రంలోకి దూకారు.ఫిలిప్పీన్స్ కోస్టు గార్డు తో సహా జాలర్లు ప్రయాణికుల్ని రక్షించారు. ఫెర్రీలో ఉన్న సుమారు 195 మంది ప్రయాణికుల్ని కాపాడారు. మరో 35 మంది సిబ్బంది కూడా ఉన్నారు. 14 మందికి గాయాలు కాగా, మరో ఏడు మంది ఆచూకీ లేకుండాపోయారు. షిప్ లిస్టులో 205 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.దక్షిణ ఫిలిప్పీన్స్ లో ఈ పడవ ప్రమాదం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement